ఐర్లాండ్ : ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు (Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను సంబురంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 30 మంది వలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని కన్నువ పంవగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 250 మంది హాజరయ్యారు.
ఆడబిడ్డలు బతుకమ్మ, దాండియా ఆటలతో తెలంగాణ పూల పండుగను సంబురంగా జరుపుకున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మలను పేర్చి ప్రతి ఆడపడుచులకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేసారు.