జర్మనీ : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ, దసరా వేడకలను ‘సమైక్య తెలుగు వేదిక స్టూటర్గ్ జర్మనీ వారి’ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి ఉయ్యాల, కోలాట పాటలతో ఆడిపాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యవర్గ బృందం సమైక్య తెలుగు వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.