e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News టీపాడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టీపాడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ ( TPAD ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని బిగ్‌బ్యారెల్స్‌ రాంచ్‌ ఇన్‌ ఆబ్రేలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు.
డల్లాస్‌లోని ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఏటా పదివేల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించే టీప్యాడ్‌.. ఈ దఫా కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో పూర్తి గ్రామీణ వాతావరణంలో, 60 ఎకరాల ఫామ్‌హౌస్‌లో, పచ్చని పంటచేల సమీపంలో నిర్వహించింది. చుట్టూ కొలనులు, చెట్లు చేమలు, ఆవులు, గుర్రాలతో ఆ ప్రాంతం అచ్చంగా పల్లెను తలపించింది.

వేడుకల్లో భాగంగా నిర్వాహకులు 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మను రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మతో సెల్ఫీలు తీసుకోవడానికి పలువురు పోటీపడ్డారు. ఏమేమి పువ్వప్పునే.. అంటూ ఆడిపాడిన మహిళలు.. అనంతరం బతుకమ్మలను సమీపంలోని కొలనులో నిమజ్జనం చేశారు. దసరా వేడుకల్లో భాగంగా ఫ్రిస్కోలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి కుమార్‌ నేతృత్వంలో శమీపూజ నిర్వహించారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఎడ్లబండిలో ఊరేగించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.

- Advertisement -

ఈ విశేష కార్యక్రమాన్ని రావు కల్వల, మాధవి సుంకిరెడ్డి, రవికాంత్‌ మామిడి, గోలి బుచ్చిరెడ్డి, రఘువీర్‌బండారు, ఇంద్రాని పంచెర్పుల, రూపా కన్నయ్యగారి, అనురాధ మేకల నేతృత్వంలో TPAD executive committee సభ్యులు వివిధ కమిటీలుగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement