హైదరాబాద్ : ప్రపంచలో వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారందరిని ఓకే సాహితీ వేదికపై తీసుకొచ్చేందుకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణా అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం సంస్థలు బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తేదీల్లో టొరంటో, కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో జరుగుతున్న ‘మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’ ప్రత్యేక తెలుగు భాషా సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
మా ఆహ్వానాన్ని మన్నించి సుమారు 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ఎంతో ఉత్సాహంగా స్పందించి తమ ప్రసంగ ప్రతిపాదనలని మాకు పంపించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయా వక్తలందరికీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అందరికీ అవకాశం కలిగించడానికి సదస్సు జరిగే సమయాలని రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (EST, Toronto Time) పొడిగించినట్లు వారు పేర్కొన్నారు. అంటే మొత్తం 20 గంటలకి పైగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. టోరంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించేలా అంతర్జాలంలో జరుగుతుందన్నారు.
సమగ్ర కార్యక్రమం, ప్రసంగాల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు (EST, Toronto Time 9:00 AM-7:00 PM ప్రతి రోజు)
September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1
September 26, 2021 YouTube: https://bit.ly/3mjgLYS వీటిలో దర్శించవచ్చన్నారు. అంతే కాదు. త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వం లో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాలు ఈ వీడియో లింక్ లలొ చూడొచ్చని వివరించారు.
https://youtu.be/U4tX3dNHlKw అలాగే ఈ సదస్సుకు సంబంధించిన ఏ విషయానికైనా ఈ క్రింది వారిని సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. సంచాలకులు లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా), sadassulu@gmail.com, వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, USA), vangurifoundation@gmail.com, సంధాన కర్తలు: విక్రమ్ సింగరాజు (కెనడా), triv.sing@gmail.com, శాయి రాచకొండ (USA), sairacha@gmail.com, కార్యనిర్వాహక సంఘం సభ్యులు యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల.