సోమవారం 30 నవంబర్ 2020
Nri-news - Oct 10, 2020 , 14:25:29

ప్ర‌పంచ తెలుగు సాహితీ స‌ద‌స్సు ప్రారంభం

ప్ర‌పంచ తెలుగు సాహితీ స‌ద‌స్సు ప్రారంభం

హైదరాబాద్‌ : ఏడ‌వ‌ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా శ‌నివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు సాహిత్యాభిమానుల వేదికగా జ‌రిగే ఈ స‌ద‌స్సును ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ రెండు రోజుల పాటు 32 గంటలు ఏకధాటిగా సదస్సు జరగనుంది. వీడియో జూమ్‌ ద్వారా జరిగే ఈ సదస్సును తెలుగు భాషను ప్రేమించే వారు ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా, ఏ సమయంలోనైనా వీక్షించొచ్చు. 

ప్ర‌పంచ నలుమూలల నుంచి సుమారు 200 మంది అతిథులు, వక్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. 15 పుస్తకావిష్కరణలు, వివిధ చర్చావేదికలతో ఆసక్తికరంగా కొనసాగనున్న ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ ఈ క్రింది లింకుల ద్వారా మీ ఇంటి నుంచే వీక్షించొచ్చు. 

YouTube Links:

https://bit.ly/3is8lsy Vedika 1 to vedika 11

https://bit.ly/2EUJEHo

Vedika 12 to vedika 15

Facebook Links:

https://bit.ly/3itifu3

https://bit.ly/3nl0z7t