Nri-news
- Nov 27, 2020 , 15:00:27
హైదరాబాద్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించండి

కువైట్ : గత 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ ఏండ్లలో చేసి చూపించారని టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. మన తెలంగాణ యాస, భాషకు వన్నె తెచ్చి, కన్నీరు తప్ప నీరు తెలియని ఈ నేలపై జలసిరులు కురిపించారు. మెట్రో పరుగులు, ఫ్లై ఓవర్లు, కేబుల్ బ్రిడ్జి నిర్మించారు. అంతే కాకుండా తాగునీటి ఇబ్బందులు లేవు, కరెంటు కోతలు లేవు ముఖ్యంగా మత కల్లోలాలు అస్సలేవని సీఎం కేసీఆర్ పాలనను ప్రశంసించారు. మరెన్నో ఇంటర్నేషనల్ కంపెనీలను తీసుకు వచ్చారు. ఈ అభివృద్ధి ఇలాగే మున్ముందు జరగాలన్న, హైదరాబాద్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్న, ఎంతో ముందు చూపు ఉన్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
MOST READ
TRENDING