శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nri-news - Oct 31, 2020 , 15:53:37

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : టీఆర్‌ఎస్‌ యూకే శాఖ

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : టీఆర్‌ఎస్‌ యూకే శాఖ

హైదరాబాద్‌ : దుబ్బాకలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భారీ విజయం సాధించబోతుందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ దూసరి పేర్కొన్నారు. గత రెండు మూడు వారాల నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంతో పాటు సోషల్‌ మీడియా ద్వారా పార్టీ గెలుపునకు క్రియాశీలకంగా పని చేశామని ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సమయంల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధికే పట్టం కడుతామని చెప్పారని క్షేత్రస్థాయిలో ప్రచార బృందానికి నాయకత్వం వహిస్తున్న సిక్కా చంద్రశేఖర్‌ గౌడ్‌, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శానబోయిన పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ అసత్య ప్రచారాలకు ఓటుతో ప్రజలే బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజా శ్రేయస్సుకై పనిచేయాలని నాయకులు సృజన్ రెడ్డి చాడ, రమేశ్‌, అశోక్ హితవు పలికారు. ఎన్నారైలంతా టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ వెంటే ఉన్నారని, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని ఎంతో మంది ఎన్నారైలతో మాట్లాడమని, బంధుమిత్రలంతా టీఆర్‌ఎస్‌కే తమ ఓటు వేస్తామని చెప్పారని నాయకులు రవి రేతినేని, సురేష్ బుడగం, రవి ప్రదీప్ పులుసు చెప్పారు. ముఖ్యంగా మైనారిటీ ప్రజలకోసం కేసీఆర్‌ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని, ప్రతి ఇంట్లో ఏదో ఒకరకంగా లబ్ధిపొందిన వారేనని, వారంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని అబ్దుల్‌ జఫర్‌ పేర్కొన్నారు.

ఎన్నారై సోషల్‌ మీడియా ఇన్‌చార్జి నవీన్‌ భువనగిరి మాట్లాడుతూ ప్రతి సామాజిక మాధ్యమంలో దుబ్బాకలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా ప్రచారం చేశామని, ప్రత్యర్థుల అసత్య ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టామనన్నారు. కేసీఆర్‌ నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష అని, టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే దుబ్బాకలో మరింత అభివృద్ధి జరుగుతుందని కార్యదర్శి సత్య చిలుముల అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, బ్యాలెట్‌పై మూడో వరుసలో కారు గుర్తుకు ఓటెయ్యాలని దుబ్బాక ప్రజలను ఎన్నారై టీఆర్‌ఎస్‌ శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం కోరారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.