ఆదివారం 09 ఆగస్టు 2020
Nri-news - Jul 15, 2020 , 23:00:13

గల్ఫ్‌ కార్మికులకు అండగా యూఏఈ టీఎఫ్‌ఏ ,జీడబ్ల్యూఏసీ

గల్ఫ్‌ కార్మికులకు అండగా యూఏఈ  టీఎఫ్‌ఏ ,జీడబ్ల్యూఏసీ

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయులు విపత్కరి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. తెలంగాణకు చెందిన వలస కార్మికులు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జీవనబృతి కోల్పోయి గత నాలుగు నెలలుగా దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. స్వదేశాలకు రావడానికి విమానాలు లేక ఆందోళనకు గురయ్యారు. భారత ప్రభుత్వం వందే భారత్‌ ద్వారా కొంత మందిని రప్పించినా అనేక మంది అక్కడే చిక్కుకుపోయారు. వారిని స్వదేశాలకు పంపించేందుకు కృషి చేస్తున్నట్లు టీఎఫ్‌ఏ అధ్యక్షుడు రాజశ్రీనివాసరావు, జీడబ్ల్యూఏసీ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. ఈ విషయంలో వలస కార్మికులకు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బీగాల అండగా నిలుస్తున్నారని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ అనుమతులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, అధికారులతో సమన్వయం చేసుకుంటూ అనుమతులు తీసుకువస్తున్న ఎన్నారై శాఖ సలహాదారు మాజీ ఎంపీ కవిత, చిట్టిబాబుకు కార్మికులకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు టీఎఫ్‌ఏ, జీటీడబ్ల్యూఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 


logo