గురువారం 03 డిసెంబర్ 2020
Nri-news - Sep 16, 2020 , 20:25:06

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు : టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు : టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

హైదరాబాద్‌ : నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫ్రాన్స్ అధ్యక్షుడు నీలా శ్రీనివాస్ అన్నారు. ఆధార్‌కార్డు లేని ఎన్నారైల భూముల విషయంలో నిన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘ఆధార్‌ లేనంత మాత్రాన ఎన్నారైల భూమి పోకూడదు. వారి భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే.. ఎన్నారైలకు భూమి ఉండి ఆధార్‌ లేకుంటే పాస్‌పోర్ట్‌ లాంటి వేరే ఏదైనా రుజువు పత్రం తీసుకొని వాటిని ధరణిలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాం.’ అని అన్నట్లు శ్రీనివాస్‌ బుధవారం గుర్తు చేశారు.

ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా అంతమై రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లలో జాప్యం త‌గ్గిపోతుంద‌న్నారు. దీని వల్ల విదేశాల్లో ఉన్న ఎన్నారైలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో ఉన్న తెలంగాణ ప్రజల తరపున సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్‌ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్ రావు మృతికి శ్రీనివాస్‌ నివాళులర్పించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.