'ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికి కృతజ్ఞతలు'

లండన్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్ధాపకధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌పై ఆయన స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమైన ఆయుధమన్నారు. కానీ హైదరాబాద్‌లాంటి విద్యావంతులు అత్యధికంగా ఉండే నగరంలో తక్కువ ఓటింగ్ శాతం జరగడం విచారకరమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పని చేసిన స్థానికులకు, ఎన్నారై టీఆర్ఎస్ సభ్యులకు, ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అదేవిధంగా సోషల్ మీడియా బాధ్యులు వై.సతీష్ రెడ్డి, క్రిశాంక్, జగన్‌తో ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయపరిచి మరొక్కసారి పార్టీ సోషల్ మీడియా సత్తాను చాటి చెప్పారన్నారు. డిసెంబర్ నాలుగున వెలుబడే ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక డివిజన్లు గెలుచుకొని బల్దియాలో మరోమారు గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం ఉందన్నారు.
తాజావార్తలు
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ఫేస్బుక్, ట్విట్టర్లకు కేంద్రం ఝలక్:21న విచారణకు రండి!
- నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో కష్టాలకు చెక్: బీ అలర్ట్..
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం