బుధవారం 25 నవంబర్ 2020
Nri-news - Oct 31, 2020 , 12:48:48

తెలుగు సాహితీ స‌ద‌స్సు విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మం

తెలుగు సాహితీ స‌ద‌స్సు విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్ : 7వ ప్ర‌పంచ తెలుగు సాహితీ స‌ద‌స్సు విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మానికి కార్య‌నిర్వాహ‌క వ‌ర్గం తెలుగు సాహితీ అభిమానుల‌ను సాద‌రంగా ఆహ్వానించింది. ఈ కార్య‌క్ర‌మం శ‌నివారం మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల నుంచి రాత్రి 8:30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ప్ర‌ముఖ న‌టులు, సాహితీవేత్త కే బ్ర‌హ్మానందం జూమ్ యాప్ ద్వారా ఈ విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను ప్రారంభించ‌నున్నారు. ప్రముఖ రచయిత్రి రాధిక మంగిపూడి (సింగపూర్), గాయని సుచిత్ర మూర్తి ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. ఈ విజయోత్సవాల సదస్సు జూమ్ ద్వారా జ‌ర‌గ‌నుంది. తెలుగు భాషని ప్రేమించే వారు ప్రపంచం లో ఏ దేశంలో నివశసిస్తున్నా, ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ లో కానీ, ఫేస్ బుక్ లో కానీ వీక్షించ‌వ‌చ్చు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 10, 11వ తేదీల్లో ఐదు ఖండాల నుంచి నిర్విరామంగా సుమారు 36 గంట‌ల పాటు ప్ర‌పంచ తెలుగు సాహితీ స‌ద‌స్సు జ‌రిగిన విష‌యం తెలిసిందే. 200 మంది వ‌క్త‌లు పాల్గొని ప్ర‌సంగించారు. 25 వేల మంది తెలుగు సాహిత్య అభిమానులు ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి చ‌రిత్ర సృష్టించారు. 

Face Book Link: https://www.facebook.com/108993030870390/posts/181805250255834/?d=n

YouTube Link:

https://youtu.be/OXLoVspTnOM