గురువారం 01 అక్టోబర్ 2020
Nri-news - Aug 15, 2020 , 18:46:04

విజ‌య‌వంతంగా ముగిసిన భాగ‌వ‌త జ‌యంత్యుత్స‌వాలు

విజ‌య‌వంతంగా ముగిసిన భాగ‌వ‌త జ‌యంత్యుత్స‌వాలు

సింగ‌పూర్ : తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ వేదిక‌గా 4వ అంతర్జాతీయ  భాగవత జయంత్యుత్సవాలు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ లైవ్  ద్వారా ఘనంగా నిర్వహించారు.  ఈ ఏడాది భాగ‌వ‌త ఉత్స‌వాల‌ను రెండు రోజుల పాటు నిర్వ‌హించారు. కృష్ణాష్ట‌మి(ఆగ‌స్టు 11) రోజున రాత్రి 7 నుంచి 8:30 గంట‌ల వ‌ర‌కు భాగవత పారాయణం, భాగవత పద్య పఠనము, శ్రీ సూక్త పఠనము పోటీలు నిర్వ‌హించారు. ఆగ‌స్టు 15వ తేదీన‌ పిల్లల పాటలు, పద్యాలు, నృత్యము మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 

ఈ పోటీల్లో మొత్తం 25 మంది పిల్ల‌లు పాల్గొన్నారు. ఈ ఉత్స‌వ వేడుక‌ల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా 500ల మంది వీక్షించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి  శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతి సంయమీంద్ర మహాస్వాములవారు విశిష్ట అతిథిగా పాల్గొని భాగవత ప్రాశస్త్యాన్ని గురించి చక్కటి సందేశము ఇచ్చారు.   భాగవత ప్రచారానికి విశేష కృషి జరుపుతున్న డాక్టర్ మురళీ మోహన్‌ను భాగవతరత్న పురస్కార ప్రదానంతో సత్కరించారు.

శ్రీ పెద్ది సాంబశివరావు తెలుగుభాగవతం.ఆర్గ్ నుండి సమకూర్చిన "పోతనామాత్య భాగవత పరిచయము - అష్టమ స్కంధం" అనే డిజిటల్ పుస్తకాన్ని కినిగె ద్వారా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అంతర్జాలంలోని తెలుగు వారందరికీ ఉచితంగా అందచేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాక విన్నూత్నమైన పద్ధతిలో కథల పుస్తకాలను ఆగ్మెంటేడ్ రియాలిటీ (Augmented Reality) మొబైల్ అప్ తో కలిపి  ప్రపంచంలోనే మొట్టమొదటి "లైవ్ కథల పుస్తకం" ను కథ.AR అనే పేరుతో ఆవిష్కరించారు (www.katha-ar.com).

ఈ అంతర్జాతీయ  భాగవత జయంత్యుత్సవములు  విజయవంతంగా   నిర్వహించటానికి సహకరించిన  తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి నిర్వహణ కమిటీ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.


logo