శుక్రవారం 27 నవంబర్ 2020
Nri-news - Oct 29, 2020 , 16:13:01

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై ఎన్నారైల ప్ర‌శంస‌లు

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై ఎన్నారైల ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రారంభించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ఎన్నారైలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రాష్ర్ట ప్ర‌జానీకంతో పాటు ఎన్నారైల‌కు ఈ పోర్ట‌ల్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దేశ చ‌రిత్ర‌లోనే సీఎం కేసీఆర్ నిలిచిపోతార‌ని కొనియాడుతున్నారు. 

ద‌శాబ్దాలుగా ఉన్న భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు వీల్లేకుండా వీఆర్‌వో దోపిడీ వ్య‌వ‌స్థ‌ను రూపుమాపుతూ.. ఆన్‌లైన్‌లో సుల‌భ‌త‌రంగా భూ క్ర‌య‌,విక్ర‌యాల‌కు వెసులుబాటు క‌ల్పిస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. -హ‌రీష్ రంగ‌, సౌతాఫ్రికా


రెవెన్యూ సేవ‌ల‌ను సుల‌భంగా, పార‌ద‌ర్శ‌కంగా అందించేందుకు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌డం సంతోషం. భూముల రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌డం మంచి ప‌రిణామం. ఎన్నారైల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌దిహేను నిమిషాల్లో రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌డం గొప్ప విష‌యం. -గుర్రాల నాగరాజు, సౌత్ ఆఫ్రికా 

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ విష‌యం. వినూత్న‌మైన ఆలోచ‌న‌ల‌కు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్ట‌డం అభినంద‌నీయం. -ర‌వి, ఆడిలైడ్‌(ఆస్ర్టేలియా)

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్. ఈ పోర్ట‌ల్ ప్రారంభం తెలంగాణ‌కు మైలురాయి. దేశ చ‌రిత్ర‌లోనే సీఎం నిలిచిపోతారు. రైతుల‌తో పాటు ప్ర‌జ‌ల‌కు ఈ పోర్ట‌ల్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. -ర‌వి శంక‌ర్‌, సిడ్నీ

ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఈ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఎన్నారైల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని చేప‌ట్టాల‌ని కేసీఆర్‌ను కోరుతున్నాం. -నీలా శ్రీనివాస్‌, ఫ్రాన్స్

ఈ పోర్ట‌ల్ ప్రారంభంతో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో న‌వ శ‌కానికి తెలంగాణ ప్ర‌భుత్వం నాంది ప‌లికింది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా విదేశాల్లో ఉంటున్న మాకు.. భూముల వివ‌రాల‌ను తెలుసుకునేందుకు సుల‌భంగా ఉంటుంది. ఎన్నారైలకు ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రం. ఈ సంద‌ర్భంగా ఎన్నారైల ప‌క్షాన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఎన్నారైల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన కేటీఆర్‌కు ధ‌న్య‌వాదాలు. - అనిల్ కుర్మాచ‌లం, లండ‌న్  


సీఎం కేసీఆర్ ప్రారంభించిన ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూ లావా దేవీలల్లో పారదర్శకత ఉంటుంది. విదేశాల్లో మాదిరిగా ఆన్లైన్ ద్వారా భూ రికార్డుల వివరాలని ప్రపంచంలో ఎక్కడున్నా తెలుసుకోవడం, క్రయ విక్రయాలకు సంబందించిన ప్రభుత్వ టాక్స్ వివరాలని తెలుసుకోవడం మాకెంతో ఉపయోగకరం ఉంటుంది. - ప్రసూన, ఎన్నారై లండన్, - శ్రీవిద్య పింగళి , ఎన్నారై లండన్
ధరణి పోర్టల్ వల్ల ఎన్నారైల్లో రెవెన్యూ వ్యవస్థ పై మరింత నమ్మకం పెరుగుతుంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చే దుస్థితి నుంచి ధరణి ద్వారా విముక్తి కలుగుతుంది. మేము ఎక్కడున్నా మాకు కావాల్సిన భూమి వివరాలు ధరణి ద్వారా లభిస్తాయి. ఈ నూతన విధానాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్‌కు  కృతజ్ఞతలు. - రంజిత్ ఛత్రాజ్, ఎన్నారై యూకేరెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.  -నవీన్ రెడ్డి,  ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే ఉపాధ్యక్షుడు