బుధవారం 08 జూలై 2020
Nri-news - Jun 07, 2020 , 08:04:40

కృష్ణాబోర్డుకు తెలంగాణ ఎన్నారై ఫోరం లేఖ

కృష్ణాబోర్డుకు తెలంగాణ ఎన్నారై ఫోరం లేఖ

హైదరాబాద్ : శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టును వెంటనే నిలువరించాలని తెలంగాణ ఎన్నారై ఫోరం కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసింది. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది. ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లా, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని, ఈ కొత్త ప్రాజెక్టుతో తిరిగి అదే చీకట్లోకి వెళ్లే ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఫిర్యాదుపై సంతకం చేసినవారిలో ఎన్నారో ఫోరం ఫౌండర్‌ చైర్మన్‌ గంప వేణుగోపాల్‌, అధ్యక్షుడు ప్రమోద్‌ అంతటి గౌడ్‌, ఇంఛార్జి ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు గంగసాని ప్రవీణ్‌రెడ్డి, రంగు వెంకటేశ్వర్లు, కార్యదర్శి మహేశ్‌ జమ్ముల ఉన్నారు.


logo