శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nri-news - Jan 17, 2021 , 14:02:23

జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

హైదరాబాద్‌: ప్రపంచ నలుమూలలకు విస్తరించిన భారతీయులు తమ మూలాలను మరచిపోవడం లేదు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలవారికి పంచుతున్నారు. ఇందులో భాగంగా జర్మనీలో ఉన్న ప్రవాస భారతీయులు, తెలుగు వారు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మన తెలుగు అసోసియేషన్ (మాట) ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని వయస్సులవారిని అలరించాయి. 


కరోనా కారణంగా ఈ ఏడాది సామజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ఆట, పాటల కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో ప్రముఖ గాయకులు శివాని సరస్వతుల, శ్రీనివాస శర్మ, ప్రనవ్ పాల్గొన్నారు. వీరితోపాటు ప్రముఖ అంతర్జాతీయ వెంట్రిలోక్విస్ట్ సంతోష్.. చిన్నారులను అలరించారు. 


VIDEOS

logo