శుక్రవారం 27 నవంబర్ 2020
Nri-news - Oct 25, 2020 , 06:42:09

ఖతార్‌లో ‘సద్దుల’ వేడుకలు

ఖతార్‌లో ‘సద్దుల’ వేడుకలు

హైదరాబాద్‌ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఖతార్‌లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఖతార్‌లో భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌, ఏపీ మణికంఠన్‌, బాబు రాజన్‌, వినోద నాయక్‌ అతిథులుగా హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకలు తెలంగాణ జాగృతి ఖతార్‌ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని ఆధ్వర్యంలో నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ, చేనేత మాస్క్‌లు ధరించి ఉత్సవాల్లో మహిళలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని గౌరమ్మను వేడుకున్నట్లు నందిని తెలిపారు. అనంతరం గత చేనేత దినోత్సవ సందర్భంగా నిర్వహించిన చాలెంజ్‌ కార్యక్రమం విజేతలకు తెలంగాణ నుంచి ఖతార్‌కు ప్రత్యేకంగా తెప్పించిన చేనేత బహూకరించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు హరికాప్రేమ్, సుధ శ్రీరామోజీ, స్వప్న కేసా, సాయిగిరి వంశీ, స్వప్న అల్లే, మమతా దుర్గం , అరుణ్ అలిశెట్టి, శ్రీ కాంత్ కొమ్ముల పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.