మంగళవారం 04 ఆగస్టు 2020
Nri-news - Jul 02, 2020 , 11:43:05

‘జాగృతి’ ఆధ్వర్యంలో ఐర్లండ్‌లో పీవీ జయంతి ఉత్సవాలు

‘జాగృతి’ ఆధ్వర్యంలో ఐర్లండ్‌లో పీవీ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌: ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ఉగ్రవాదం వంటి అనేక సమస్యలతో భారతదేశం సతమతమవుతున్న సమయంలో తెలంగాణ బిడ్డ పీవీ నరసింహా రావు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, సమర్థవంతగా పరిపాలన సాగించారని ఐర్లాండ్‌ తెలంగాణ జాగృతి అధ్యక్షడు పల్లె సంతోష్‌ అన్నారు. ఐర్లాండ్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ జాగృతి ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడం సంతోషించదగిన విషయమని పేర్కొన్నారు. ఐర్లండ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఐర్లండ్‌ తెలంగా జాగృతి ఉపాధ్యక్షుడు జయంత్‌ రెడ్డి మెట్టు, ప్రవాస భారతీయులు ఉపేందర్‌ రెడ్డి, పవన్‌ కుమార్‌, శ్రీనివాస్‌ కార్ప్‌, శ్రీనివాస్‌ ఎల్లంపల్లి, శ్రీకాంత్‌, రమణారెడ్డి, శ్రీనివాస్‌ వెచ్చ, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo