సోమవారం 18 జనవరి 2021
Nri-news - Nov 30, 2020 , 17:05:40

అభివృద్ధి చేసే వాళ్లకే పట్టం కట్టండి

అభివృద్ధి చేసే వాళ్లకే పట్టం కట్టండి

ఆస్ట్రేలియా : గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ గుండె లాంటిదని, దీన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ల చేతిలో పెట్టొద్దని ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తిరుగులేని విజయాన్ని అందించాలని టీఆర్‌ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర రాజధానిని మతోన్మాదుల చేతిలో పెట్టొద్దని హైదరాబాద్ ప్రజలు తమ విజ్ఞతతో అబద్ధపు ప్రచారాలు చేసే వారిని కాకుండా అభివృద్ది పతంలో నడిపే టీఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు. విద్వేషాలు రెచ్చకొట్టి సామాన్య ప్రజలను సమిధలు చేసే మత తత్వ పార్టీ లైన బీజేపీ, ఎంఐఎంలను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.