శనివారం 05 డిసెంబర్ 2020
Nri-news - Sep 18, 2020 , 11:11:16

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారైలు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారైలు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు. ఆధార్‌కార్డు లేని ఎన్నారైల భూముల విషయంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ‘ఆధార్‌ లేనంతమాత్రాన ఎన్నారైల భూమి పోకూడదు. వారి భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నారైలకు భూమి ఉండి ఆధార్‌ లేకుంటే పాస్‌పోర్ట్‌ లాంటి ఏదైనా రుజువు పత్రం తీసుకొని, వాటిని ధరణిలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాం’ అని ప్రకటించడంపై టీఆర్‌ఎస్‌ న్యూజిలాండ్‌ శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ భాస్కర్‌రెడ్డి కోస్నా, ప్రవాస భారతీయుడు సుధీర్‌ జలగం హర్షం వ్యక్తం చేశారు.

ప్రవాస భారతీయులు ఆధార్‌ కార్డులు లేక పాస్‌బుక్కులు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారంటూ ఏప్రిల్‌ 27, 2018లో సీఎం కేసీఆర్‌ను అప్పటి నిజామాబాద్‌ ఎంపీ కవిత ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాలతో కలిసి సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములకు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీని అధికారులు తాత్కాలికంగా నిలిపేశారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త పాస్‌ పుస్తకాల జారీ విషయంలో, భూముల అమ్మకం సమయంలో ఓవర్సీస్‌ సిటిజన్‌ షిప్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ)  కార్డ్స్‌ ఉన్న ప్రవాసీయులకు ఆధార్‌ విషయంలో సడలింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయడంపై ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.