గురువారం 04 మార్చి 2021
Nri-news - Dec 29, 2020 , 13:42:33

దేవేందర్‌రెడ్డి మృతిపై ఎన్నారైల దిగ్భ్రాంతి

దేవేందర్‌రెడ్డి మృతిపై ఎన్నారైల దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ : అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, టీఆర్‌ఎస్‌ నేత దేవేందర్‌ నల్లమడ మృతిపై టీఆర్ఎస్‌ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాలతో పాటు పలువురు ఎన్నారైలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారులో నిప్పంటుకోవడంతో మృతి చెందారని, అమెరికాలోని భార్య అనురాధ, కుటుంబ సభ్యులు యుగంధర్‌తో మాట్లాడి సంతాపం తెలియజేసినట్లు పేర్కొన్నారు. కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. విషయాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ ఎన్నారై సలహాదారు కవిత దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ బిగాల మాట్లాడుతూ దేవేందర్ రెడ్డి అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికార ప్రతినిధి అని, అందరికి చేదోడు వాదోడుగా ఉండేవాడన్నారు. తనకు ప్రత్యేకంగా ఆయనతో చాలా మంచి అనుబంధం ఉందని, ఏ కార్యక్రమంలోనైనా చురుగ్గా పాల్గొనేవాడని గుర్తు చేశారు. అమెరికాలో ఉన్న టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ ఎన్నారై సభ్యులతో సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. 

VIDEOS

logo