ఆదివారం 24 జనవరి 2021
Nri-news - Dec 01, 2020 , 16:35:47

ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు

హైదరాబాద్‌ : ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని  టీఆర్‌ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి అన్నారు. ఒమన్, మస్కట్ నుంచి కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి భారత దేశ పౌరుడి ప్రాథమిక హక్కు దానిని వినియోగించుకోవాలని చెప్పారు.

మన హైదరాబాద్ ప్రస్తుతం గత ఆరు సంవత్సరాలుగా ఎంతో ఎదిగి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. కొన్ని జాతీయ పార్టీల నాయకులు ప్రచారంలో పాల్గొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. వారి ప్రకటనలతో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.  


logo