శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nri-news - Oct 29, 2020 , 15:37:12

'ధ‌ర‌ణి' అద్భుతం : టీఆర్ఎస్ స‌్విట్జ‌ర్లాండ్ శాఖ

'ధ‌ర‌ణి' అద్భుతం : టీఆర్ఎస్ స‌్విట్జ‌ర్లాండ్ శాఖ

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌క్రియ అద్భుత‌మ‌ని ఎన్నారై టీఆర్ఎస్ స్విట్జ‌ర్లాండ్ శాఖ కొనియాడింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నారై టీఆర్ఎస్ స్విట్జ‌ర్లాండ్ శాఖ ప్ర‌‌తినిధులు గందె శ్రీధర్, పవన్ దుద్దిళ్ల, అల్లు కృష్ణ రెడ్డి, అనిల్ జల, కిశోరె తాటికొండ, పద్మజా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ లో భూమి మరియు ఆస్థి సమస్యలకు చరమగీతం పాడుతూ పాశ్చాత్య దేశాలకు ధీటుగా డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ  ధరణి పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. కేసీఆర్ పాల‌న‌లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని, సాగు, తాగునీటి క‌ష్టాలు తీర్చార‌ని చెప్పారు. గ‌తంలో భూముల రిజిస్ర్టేష‌న్ కోసం ఎన్నో వ్య‌య‌ప్ర‌యాసాలు ప‌డేవాళ్ల‌మ‌ని, ఇప్పుడు ఆ ప్ర‌క్రియ సుల‌భంగా మార‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ఇక నుంచి భూముల రిజిస్ర్టేష‌న్లు 15 నిమిషాల్లో పూర్త‌వ‌డం మంచి ప‌రిణామం అన్నారు. ఈ ప్ర‌క్రియ వ‌ల్ల రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు.