గురువారం 04 మార్చి 2021
Nri-news - Jan 16, 2021 , 19:14:27

సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు

 సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు

హైదరాబాద్‌ :  సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలను జూమ్ యాప్‌ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. సొసైటీ సభ్యులు పండుగ ప్రాముఖ్యతను చిన్నారులకు వివరించారు. పతంగులు, గొబ్బెమ్మల తయారీతోపాటు, చిత్ర లేఖనం, పాటలు, నృత్యపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్‌లైన్‌ ఓటింగ్ విధానంలో విజేతలను ఎంపిక చేశారు. చిన్నారుల హరిదాసు వేషధారణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యులు రూపొందించిన క్యాలెండర్‌ను విడుదల చేశారు. సంబురాల నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన దాతలకు, స్పాన్సర్లకు టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రోజా రమణి, సునీత రెడ్డి, రజిత గోనె, కల్వ లక్ష్మణ్ రాజు,  ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజాపూర్, సహవ్యాఖ్యాతగా సంతోషి కూర వ్యవహరించారు. సొసైటీ సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్‌బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె  నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్తా  నల్ల, మిర్యాల సునీత రెడ్డి,  ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోశ్‌, నంగునూరి  వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివరామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ సంబురాల్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo