బుధవారం 02 డిసెంబర్ 2020
Nri-news - Oct 29, 2020 , 15:33:35

ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు దూరం

ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు దూరం

హైదరాబాద్‌ : తెలంగాణలో భూ సమస్యలకు చరమగీతం పాడుతూ ధరణి పోర్టల్‌ ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమని  స్విట్జర్లాండ్ టీఆర్‌ఎస్‌ ఎన్నారై సంఘాల ప్రతినిధులు అన్నారు. సీఎం కేసీఆర్‌ అధికారలోకి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి తెలంగాణను అగ్రభాగాన నిలిపారన్నారు. సామాన్యుడి కష్టాలు తీర్చే విధంగా ధరణి పోర్టల్‌ రూపొందిండం ప్రశంసనీయమన్నారు. స్విట్జర్లాండ్ ఎన్నారై సంఘాల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రతినిధులు గందె శ్రీధర్, పవన్ దుద్దిళ్ల, అల్లు కృష్ణా రెడ్డి, అనిల్ జల, కిశోరె తాటికొండ, పద్మజా రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.