డాలర్ జాబ్‌లపై మోజు ఎందుకంటే!

బెంగళూరు: భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో ఉన్నతవిద్యనభ్యసించి అక్కడే హెచ్-1బీ వీసాపై పని చేయడానికి ఆసక్తి చూపుతారు. వారి జీవిత భాగస్వాములు కూడా పని చేసేందుకు వీలుగా హెచ్-4 వర్క్ పర్మిట్‌ను అనుమతినిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీచేశారు. ట్రంప్ హయాంలో రద్దు చేసిన హెచ్-4 వీసాలను ఇంతకుముందు 2015లో అప్పటి అధ్యక్షుడు బారక్ ఒబామా అనుమతించారు.
హెచ్-4 వీసాదారుల్లో సుమారు 90 శాతం మంది హెచ్-1బీ వీసా హోల్డర్ల సతీమణులే. వారంతా భారత్‌లో డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారే. 2019లో 1,11,632 డాలర్ల మేరకు వేతనం పొందిన హెచ్-4 వీసా హోల్డర్లకు శాశ్వత నివాసం కల్పించాలని సంబంధిత యాజమాన్యాలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. హెచ్-1 బీ వీసా హోల్డర్ల వేతనం 1,13,022 డాలర్లు ఉంటే, అమెరికా నిపుణులకు కేవలం 53,490 డాలర్ల శాలరీ మాత్రమే ఇస్తూ వచ్చారు.
హెచ్-బీ వీసా హోల్డర్లు భారతీయులే కాబట్టి హెచ్-4 వీసాలు పొందిన వారిలో ఇండియన్ మహిళలకే అగ్ర తాంబూలం. దశాబ్ద కాలం అమెరికాలో నివసించిన వారికి పర్మినెంట్ నివాస హోదా (గ్రీన్ కార్డ్) లభించింది. ఇంతకుముందు 15 ఏండ్ల తర్వాత భారతీయ నిపుణులు గ్రీన్ కార్డు పొందగలిగే వారు.
హెచ్-1బీ వీసాపై అమెరికాలో పని చేస్తున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉండటంతో దేశాల కోటా వారీగా గ్రీన్ కార్డులు జారీ చేస్తూ వల్ల మనోళ్లు ఎక్కువకాలం వేచి చూడాల్సి వచ్చేది. గతేడాది ఆగస్టు వరకు అమెరికాలో హెచ్-4పై నివాసం ఉంటున్న వారు ఐదు లక్షల మంది భార్యలు ఉన్నారు. 2015-20 మధ్య హెచ్-4 వీసాదారుల్లో మూడింట రెండొంతుల మందికి సంబంధిత సంస్థలు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని సిఫారసు చేశాయి. వీరిలోనూ మూడింట రెండొంతుల మంది సాఫ్ట్వేర్ డెవలపర్లే కావడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.