శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nri-news - Jan 16, 2021 , 19:52:06

సిన్సినాటి డెమోక్రాట్‌ మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఇండో అమెరిక‌న్

సిన్సినాటి డెమోక్రాట్‌ మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఇండో అమెరిక‌న్

వాషింగ్ట‌న్‌: ఇండో-అమెరిక‌న్ న్యాయ‌వాది, డెమోక్రాటిక్ నేత అఫ్తాబ్ పురేవాల్ (38) సిన్సినాటి మేయ‌ర్ అభ్య‌ర్థిగా నిలిచారు. క‌రోనా మ‌హ‌మ్మారితో అత‌లాకుత‌ల‌మైన సిన్సినాటి న‌గ‌ర ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తుల‌ను మెరుగు ప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. హామిల్ట‌న్ కౌంటీ కోర్టు క్ల‌ర్క్‌గా ప‌ని చేస్తున్న అఫ్తాబ్ పురేవాల్‌.. త‌న అభ్య‌ర్థిత్వాన్ని రెండు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించారు. 

త‌మ దేశం, త‌మ న‌గ‌రం విష‌మ ప‌రిస్థితుల్లో చిక్కుకుంద‌ని పేర్కొన్నారు. మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌భుత్వ సేవ‌ల‌ను ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులోకి తేవ‌డంతోపాటు కొవిడ్‌-19 వ‌ల్ల దెబ్బ‌తిన్న ప్ర‌తి ఒక్క‌రికి ఆర్థిక సాయం అందేలా చూస్తాన‌ని చెప్పారు. స్థానిక దిన‌ప‌త్రిక ఎంక్వైర‌ర్‌ క‌థ‌నం ప్ర‌కారం అఫ్తాబ్ పురేవాల్ త‌ల్లిదండ్రులు 1980ల్లో భార‌త్ నుంచి ఓహియోలోని జెనియాకు వ‌ల‌స వెళ్లి అక్క‌డే స్థిర ప‌డ్డారు.

2018లో అమెరికా కాంగ్రెస్‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. క‌రోనాతో కుటుంబాల‌న్నీ అల్లాడుతున్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని, దాని ప్ర‌భావం నుంచి ఇప్పుడిప్పుడే అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకుంటున్న‌ద‌ని అఫ్తాబ్ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo