శనివారం 04 జూలై 2020
Nri-news - May 28, 2020 , 18:25:13

వందే భారత్‌ గల్ఫ్‌ విమానాల సంఖ్య పెంచండి

వందే భారత్‌ గల్ఫ్‌ విమానాల సంఖ్య పెంచండి

కేంద్రానికి తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని వినతి

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన  భారత్‌ ప్రభుత్వ వందే మిషన్‌ ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా గల్ఫ్‌కు ముఖ్యంగా ఖతార్ నుండి హైదరాబాద్‌కు వచ్చే విమానాల సంఖ్య పెంచాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ జైశంకర్‌ను, కేంద్ర విమానయాన మంత్రి హారదీప్‌ సింగ్‌ సూరిని ట్విట్టర్‌లో అభ్యర్థించారు తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని. 

60 దేశాల నుంచి లక్ష మందిని తీసుకురావాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ర్టాలు ముఖ్యంగా తెలంగాణ నుండి వేల సంఖ్యలో ఉపాధి కోల్పోయి, ఇతరత్రా ఎమర్జెన్సీల వలన భారత్‌ తిరిగి రావడానికి గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారత ఎంబసీలలో తమ వివరాలు నమోదు చేసుకున్నారని కానీ సరేపడే విమానాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా ఉపాధి కోల్పోయి భారత్‌ తిరిగి రావాలని ఉన్నా టికెట్‌ కు డబ్బులు లేక పేద గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐలు ఇబ్బంది పడుతున్నారని, వీళ్ళందరూ తమ తమ ఊళ్లకు తిరిగి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విమానా టికెట్‌లు అందచేయాలని కోరారు.


logo