యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న ‘అలా సింగపురం’లో..

హైదరాబాద్ : సింగపూర్ నుంచి సరికొత్త తెలుగు షార్ట్ ఫిలిం ‘అలా సింగపురం’లో శనివారం ఉదయం అంతర్జాల వేదికపై వైభవంగా విడుదలైంది. తెలుగు భాష, సంస్కృతే ఇతివృత్తంగా ఈ షార్ట్ ఫిలిం రూపొందించారు. రచన, నటన, దర్శకత్వం, సాంకేతిక రంగాల్లో పనిచేసిన వారంతా సింగపూర్‌లో నివసించే తెలుగువారే. సింగపూర్ తెలుగు టీవీ ఆధ్వర్యంలో జూమ్ అంతర్జాల వేదికపై ఈ చిత్రాన్ని సింగపూర్ తెలుగు టీవీ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీగేయ రచయిత భువన చంద్ర, దర్శకుడు వీఎన్ ఆదిత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు టీవీ వ్యవస్థాపకుడు గణేశ్న రాధాకృష్ణ మాట్లాడుతూ.. సింగపూర్‌లోని తెలుగువారి ప్రతిభతో షార్ట్ ఫిలిం రూపొందించామని, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సినీగేయ రచయిత భువనచంద్ర, దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. నటులు, దర్శకులు, రచయిత, కెమెరా మెన్తోపాటు అన్ని సాంకేతిక విభాగాల వారు అద్భుతంగా పనిచేశారని అభినందించారు. కథ తెరకెక్కించిన విధానం బాగుందని, కొత్తవారైనా పరాయి దేశంలో పరిమితులను అధిగమించి తెలుగుదనాన్ని అద్భుతంగా మనసుకు హత్తుకునేలా వెండి తెరపై ఆవిష్కరించారని అన్నారు. చిత్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ప్రవాసాంధ్రుల కుటుంబాల ఆలోచన విధానం, భారతీయ సంస్కృతితో అనుసంధానింపబడే తీరు, తలెత్తే ఘర్షణ తదితర సున్నితమైన అంశాలతో ఆకట్టుకునేలా కథను రూపొందించే యత్నం చేశామని కథ, సంభాషణలు అందించిన రాధిక మంగిపూడి తెలిపారు.
కెమెరా, దర్శకత్వం, ఎడిటింగ్ విభాగాలకు రాధాకృష్ణ సేవలందించగా, సహదర్శకుడిగా ధవళ కళ్యాణ్ ఈ చిత్రానికి పరిపూర్ణత తీసుకువచ్చారు. కాత్యాయని గణేశ్న ఆడియో సహకారం అందించగా, కవుటూరు రత్న కుమార్ గౌరవ సలహాదారు, పర్యవేక్షకులుగా వ్యవహరించారు. సింగపూర్‌లోని లావణ్య, భరద్వాజ్ గృహంలో ఈ చిత్ర షూటింగ్‌ను రెండురోజుల్లో పూర్తిచేశారు. రామాంజనేయులు, కామేశ్వరి, భార్గవి, రాజశేఖర్, శివరంజని, సంతోష్, శాంత, వైష్ణవి, ఆశ్రిత, భరత్, ప్రతీక్ నటీనటులుగా 23 నిమిషాలపాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా లఘు చిత్రం ఉంది. విడుదలైన గంటకే యూట్యూబ్‌లో 1000 మంది అభిమానాన్ని చూరగొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కమల్‌ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం