గురువారం 25 ఫిబ్రవరి 2021
Nri-news - Jan 27, 2021 , 21:51:00

హెచ్‌-1 బీ నిపుణుల‌కు గ్రీన్ కార్డ్.. షార్ట్‌క‌ట్ రూటిదే?!

హెచ్‌-1 బీ నిపుణుల‌కు గ్రీన్ కార్డ్.. షార్ట్‌క‌ట్ రూటిదే?!

పుణె: హెచ్‌-1బీ వీసా కింద ప‌ని చేస్తున్న ఇండియ‌న్ల‌కు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ భారీ రిలీఫ్ క‌ల్పించారు. వారి జీవిత భాగ‌స్వాములు.. ప్ర‌త్యేకించి మ‌హిళా టెక్కీల‌కు హెచ్‌-4 వీసా కింద వ‌ర్క్ ప‌ర్మిట్‌ను తిరిగి పున‌రుద్ధ‌రించారు. దీంతో ల‌క్ష మందికి పైగా భార‌తీయుల‌కు రిలీఫ్ ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ పురోగ‌తి కోసం హెచ్‌-1బీ వీసాదారుల భార్య‌ల్లో నిపుణులు ప‌ని చేసేందుకు ఈ నిబంధ‌న అనుమ‌తినిస్తుంది. తొలుత ఈ విధానాన్ని 2015లో అప్ప‌టి బ‌రాక్ ఒబామా ప్ర‌భుత్వం అమ‌లులోకి తీసుకొచ్చింది.

ల‌క్ష మందికి పై చిలుకు హెచ్‌-4 వీసాదారుల్లో 90 శాతానికి పైగా భార‌తీయులే. భార‌తీయుల్లో మ‌హిళ‌లు 93 శాతం పైమాటే. వీరిలో మూడింట రెండొంతుల మంది కంప్యూట‌ర్ నిపుణుల‌కు 2015-20 మ‌ధ్య గ్రీన్ కార్డు కింద ప‌ర్మినెంట్ సిటిజ‌న్ షిప్ ఇవ్వాల‌ని సంబంధిత యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేశాయి కూడా. వీరిలో మూడింట రెండొంతుల మంది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు కావ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

అమెరికాలో హెచ్‌-4 వీసా పొందిన వారు ఐదు ల‌క్ష‌ల మంది ఉంటార‌ని ఒక సంస్థ అధ్య‌య‌న నివేదిక చెబుతోంది.ఇంత‌కుముందు డొనాల్డ్ ట్రంప్‌.. అమెరికన్ ఫ‌స్ట్ పేరిట అమ‌లుచేసిన ఇమ్మిగ్రేష‌న్ వ్య‌తిరేక విధానంలో భాగంగా హెచ్‌-4 పాల‌సీని ర‌ద్దు చేశారు. ఫ‌లితంగా హెచ్‌-1 బీ వీసా దారుల కుటుంబాలు గ‌త నాలుగేండ్లుగా ప‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు.

హెచ్‌-4 వీసాల కింద వ‌ర్క్ ఆథ‌రైజేష‌న్ పొంద‌డానికి నాలుగేండ్లుగా ప‌లు ప్ర‌య‌త్నాలు చేశారు. 2020 ఆర్థిక సంవ‌త్స‌రంలో అమెరికా సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్ అధికారుల‌కు హెచ్‌-4 కింద వ‌ర్క్ ఆథ‌రైజేస‌న్ కోసం 67,690 ద‌ర‌ఖాస్తులు వ‌స్తే, 52,470 ఆమోదం పొందాయి. వీటిల్లో రెన్యూవ‌ల్ వీసాలు కూడా క‌ల‌గ‌లిసి ఉన్నాయి. 2019 మార్చిలో భార‌తీయులు 1,20,514 మంది ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 1,10,649 మందికి హెచ్‌-4 వ‌ర్క్ ప‌ర్మిట్ ల‌భించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo