మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Nri-news - Aug 04, 2020 , 17:43:39

‘అవసరమైనవారికి సహాయం చేయండి. ఆశను ఇవ్వండి’ అంటున్న శ్రీహర్ష

‘అవసరమైనవారికి సహాయం చేయండి. ఆశను ఇవ్వండి’ అంటున్న శ్రీహర్ష

హైదరాబాద్ : సింగపూర్ అమెరికన్ స్కూల్ నుంచి ఉన్నత పాఠశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థి శ్రీహర్ష శిఖాకోళ్ళు, అతని స్కూల్ సహవిద్యార్థితో  కలిసి Econ101 అనే నూతన సంస్థని స్థాపించారు. దీని ద్వారా యువ విద్యార్థుల కోసం ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. గతంలో కూడా శ్రీహర్ష, కొవిడ్ -19 కారణంగా బాధపడుతున్నవారికి సహాయం చేయడానికి సుమారు 20 లక్షలు రూపాయల (36,314$) నిధులను సేకరించారు. తన 90 రోజుల ప్రచారంతో Give.sg అనే స్వచ్చంద సంస్థ ద్వారా ‘అవసరమైనవారికి సహాయం చేయండి. ఆశను ఇవ్వండి’ అనే నినాదంతో విరాళాలు సేకరించి స్వచ్చంద సంస్థలకు అందజేశారు.


ఇప్పుడు జూమ్ కాల్ ద్వారా వారం రోజుల సెషన్‌లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. కొన్ని వారాల క్రితం నిర్వహించిన మొదటి సెషన్ కు అనూహ్య స్పందన రావడంతో ఇప్పుడు రెండో సెషన్‌కు రిజిస్ట్రేషన్‌లు తెరవబడ్డాయి. రిజిస్ట్రేషన్ కోసం బ్రోచర్ లింక్ ఇక్కడ జత చేశారు. కోర్సు వివరాలు 8 - 12 సంవత్సరాల మధ్య వయస్సు గలవారి కోసం రూపొందించబడ్డాయి. చిన్న వయస్సు నుంచే ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యత మనందరికీ తెలిసినందున.. మీ పిల్లలు, వారి స్నేహితులందరూ ఆన్‌లైన్ లింక్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




logo