గురువారం 28 జనవరి 2021
Nri-news - Nov 29, 2020 , 15:05:32

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా డెన్మార్క్ లో ఎన్నికల ప్రచారం

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా డెన్మార్క్ లో ఎన్నికల ప్రచారం

డెన్మార్క్ : డెన్మార్క్ లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ శని, ఆది వారాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ఆకుల మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి 100 పైగా కార్పొరేటర్లను గెలిపించి ఢిల్లీలో తెలంగాణ గళాన్ని వినిపించాలని ఓటర్లను కోరారు. తమ బంధు మిత్రులకు ఫోన్లు చేసి కారు గుర్తుకు ఓటు వేపించాల్సిందిగా ఎన్నారైలను కోరారు. అభివృద్ధికి ఓటు వేయాలని హైదరాబాద్ ప్రజలను కోరారు. 

ప్రచారం కంటే ముందు దీక్షా దివాస్ నిర్వహించారు. నవంబర్ 29న సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతోనే తెలంగాణ సాధించారని తెలిపారు. ప్రచారంలో ప్రసాద్ రావు కలకుంట్ల, జయ చందర్ గంట, విశాల్ వెంకట్ శెట్టి, నరేందర్ రెడ్డి ఎడమల, నరేందర్ రెడ్డి బోళ్ల, సురేందర్ రావు కేసాని, శ్రీధర్ గెంట్యాల, సురేష్ కట్ట, దామోదర్ కనుకుల, కొండా రవి పాల్గొన్నారు.


logo