శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nri-news - Oct 29, 2020 , 21:13:01

'ధరణి' పేదోడి భూమికి రక్షణ : శ‌్యామ్ ఆకుల‌

'ధరణి' పేదోడి భూమికి రక్షణ : శ‌్యామ్ ఆకుల‌

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రారంభించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ఎన్నారైలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రాష్ర్ట ప్ర‌జానీకంతో పాటు ఎన్నారైల‌కు ఈ పోర్ట‌ల్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దేశ చ‌రిత్ర‌లోనే సీఎం కేసీఆర్ నిలిచిపోతార‌ని కొనియాడుతున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక‌పై భూముల రిజిస్ట్రేషన్స్ సులభంగా, వేగంగా అవుతాయ‌న్నారు. ధరణి వలన మన భూములకు అత్యంత భద్రత కలుగుతుందని..ఇక నుండి ఎన్నారైలు, ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణాలో నమ్మకంగా భూములు కొన‌వ‌చ్చ‌ని యూరోప్ తెలంగాణ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు శ్యామ్ ఆకుల అన్నారు.