గురువారం 04 మార్చి 2021
Nri-news - Oct 30, 2020 , 22:26:26

'ధ‌ర‌ణి విప్లవాత్మకమైన మార్పు'

'ధ‌ర‌ణి విప్లవాత్మకమైన మార్పు'

మంచిర్యాల‌ : ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పు అని ద‌క్షిణాఫ్రికా జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేసే వెల్త‌పు భూమ‌య్య అన్నారు. త‌న‌ది మంచిర్యాల జిల్లా జెండావెంకటాపూర్‌ గ్రామం అని తెలిపిన ఆయ‌న‌ ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్లు తెలిపారు.భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికార‌ని కొనియాడారు. గతంలోలా కాకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా తమ ఆస్తులను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చ‌న్నారు. త‌మ‌లాగా విదేశాల్లో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

VIDEOS

logo