గురువారం 04 మార్చి 2021
Nri-news - Nov 07, 2020 , 17:03:17

ఓసీఐ లేదా పాస్‌పోర్ట్ ద్వారా రిజిస్ర్టేష‌న్‌కు సీఎం హామీ

ఓసీఐ లేదా పాస్‌పోర్ట్ ద్వారా రిజిస్ర్టేష‌న్‌కు సీఎం హామీ

హైద‌రాబాద్ : ఆధార్‌కార్డు లేని ఎన్నారైల‌కు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా) లేదా పాస్ పోర్ట్ ద్వారా ధ‌ర‌ణిలో రిజిస్ర్టేష‌న్స్‌కు అవ‌కాశం క‌ల్పించేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తీసుకురావ‌డం ప‌ట్ల‌ టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ఎన్నారైల తరఫున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బిగాల మాట్లాడుతూ.. అన్ని దేశాల ప్రతినిధులతో ధరణి గురించి వాకబు చేయగా అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వ‌చ్చిన‌ట్లుగా సీఎంకు తెలిపారు. అలాగే ఎన్నారైల భూములకు కూడా ఆధార్ లేకుండా ఓసీఐ కార్డు ద్వారా చేసుకోవచ్చు అని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బిగాల‌ గుర్తు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ అక్కడి అధికారులను ఎన్నారైల విషయములో పరిశీలించి తగిన ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. 

మధ్యవర్తులు లేరు. పట్వారీ జబర్దస్తీ లేదు. గిర్దావర్‌ ప్రమేయం లేదు. డిప్యూటీ తాహ‌సిల్దార్‌, తాహ‌సిల్దార్‌ను ప్రసన్నం చేసుకోవాల్సిన పనిలేదు. ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పట్టాదారు పాస్‌బుక్‌ పొందేవరకు ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే. అసలు లంచం అనే మాటే లేదు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కోసం పత్రాలతో వచ్చి పావుగంటలోనే పట్టా పట్టుకుపోతుండ్రు. రాష్ర్ట ప్ర‌భుత్వం ఇంత‌టి సౌల‌భ్యం క‌ల్పించడంప‌ట్ల‌ ఎన్నారైలంద‌రి తరపున సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు మ‌హేష్ బిగాల పేర్కొన్నారు. 


VIDEOS

logo