గురువారం 28 జనవరి 2021
Nri-news - Dec 05, 2020 , 17:25:38

‘మహానటి’కి పాటల పట్టాభిషేకం

‘మహానటి’కి పాటల పట్టాభిషేకం

హైదరాబాద్ : మహానటి సావిత్రి జయంత్రి సందర్భంగా ఆదివారం వంశీ గ్లోబల్‌ అవార్డ్స్‌, ఇండియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు అసోసియేషన్‌, శారదా కళాసమితి ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మహానటికి పాటలతో పట్టాభిషేకం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సావిత్రి నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాలాంటి 100 పాటలను 30 మంది గాయనీగాయకులు ఆలపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 17 అంతర్జాతీయ తెలుగు సంస్థల సహకారంతో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 5 ఖండాల్లోని 8 దేశాల్లో కార్యక్రమం కొనసాగనుంది. సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథిలుగా ప్రజానటి, కళాభారతి డాక్టర్‌ జమునా రమణారావు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌, సినీనటులు, నిర్మాత, మాజీ ఎంపీ ఎం‌.మురళీమోహన్‌, సినీదర్శకుడు రేలంగి నరసింహారావు, సినీనటి రోజారమణి, కవిత హాజరుకానున్నారు. 


గాయనీ గాయకులు వీరే.. 

లక్ష్మీశ్రీనివాస్‌ రామరాజు (గుంటూరు), చంద్రతేజ (హైదరాబాద్‌), కె. వెంకట్రావు (హైదరాబాద్‌), రాజేంద్రప్రసాద్‌ (వైజాగ్‌), చింతలపాటి సురేశ్‌ (హైదరాబాద్‌), సురేఖామూర్తి దివాకర్ల (హైదరాబాద్‌), వి.కె. దుర్గ (హైదరాబాద్‌), వేదుల శశికళాస్వామి (హైదరాబాద్‌), బీవీఎన్‌ఎల్‌. పద్మావతి (హైదరాబాద్‌), అఖిల (హైదరాబాద్‌), చిత్తరువు లక్ష్మి పద్మజ (హైదరాబాద్‌), అనూరాధ (హైదరాబాద్‌), హిమబిందు (హైదరాబాద్‌), కె. భాగ్యలక్ష్మి (వైజాగ్‌), శ్రీనివాసు కిశోర్‌ భరద్వాజ (అమెరికా), కుమార్‌ రాణి (అమెరికా), రాధికానోరి (అమెరికా), లలితారాణి (అమెరికా), శాంతి ఇప్పనపల్లి (అమెరికా), శ్రీనివాసరావు నందగిరి (న్యూజిలాండ్‌), శ్రీసుత నాంపల్లి (న్యూజిలాండ్‌), రవి కంచిబొట్ల (ఆస్ట్రేలియా), నీరజ విష్ణుబొట్ల (ఆస్ట్రేలియా) ప్రియాంక మార్గాని (ఆస్ట్రేలియా), ఉష చివుకుల (ఆస్ట్రేలియా), రూపాశాస్త్రి (హాంకాంగ్‌), కీర్తిక మంగు (దక్షిణాఫ్రికా), విష్ణుప్రియ (స్వీడన్‌), రాధిక నడదూర్‌ (సింగపూర్‌) తమగాన మాధుర్యాన్ని పంచనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo