బుధవారం 12 ఆగస్టు 2020
Nri-news - Jul 12, 2020 , 13:57:18

సింగ‌పూర్ లో టీసీఎస్ఎస్ బోనాల పండుగ‌

సింగ‌పూర్ లో టీసీఎస్ఎస్ బోనాల పండుగ‌

సింగ‌పూర్ : బోనాల పండుగకు తెలంగాణ ప్ర‌తీక‌. ఆషాఢ మాసంలో నిర్వ‌హించే బోనాల పండుగ సంబురాలు అంబ‌రాన్ని అంటుతాయి. కానీ క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి బోనాల వేడుక‌ను ఇంటికే ప‌రిమితం చేశారు. విదేశాల్లో జ‌రుపుకునే తెలంగాణ ప్ర‌జ‌లు కూడా బోనాల పండుగ‌ను నిరాడంబ‌రంగా నిర్వ‌హించుకుంటున్నారు. ‌

సింగ‌పూర్ లో తెలంగాణ క‌ల్చ‌ర‌ల్ సొసైటీ(టీసీఎస్ఎస్) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన బోనాల పండుగ వేడుక‌లు క‌రోనా దృష్ట్యా చాలా నిరాడంబ‌రంగా జ‌రిగాయి. సుంగే కేడుట్ లోని శ్రీ అర‌స కేస‌రి శివ‌న్ ఆల‌యంలో సింగ‌పూర్ ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ బోనాల వేడుక‌ను జ‌రుపుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించి.. భౌతిక దూరం పాటిస్తూ భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని క‌రోనా బారి నుంచి కాపాడాలని కోరుతూ  ప్రత్యేక పూజలు చేసినట్టు టీసీఎస్ఎస్ స‌భ్యులు తెలిపారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపులో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి.  కానీ ఈ ఏడాది చాలా నిరాడంబరంగా బోనాల వేడుక‌లు జరిగాయి. 

తెలంగాణ‌  బోనాల పండుగను సింగపూర్ కు నాలుగేళ్ళ క్రితం పరిచయం చేయడంతో టీసీఎస్ఎస్ పేరు చరిత్ర లో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని స‌భ్యులు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో టీసీఎస్ఎస్ ఎప్పుడు ముందుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గొనె రజిత నరేందర్ రెడ్డి, గడప స్వాతి రమేశ్ బండ శ్రీదేవి మాధవ రెడ్డి దంపతులు ఉన్నారు. 

సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, మరియు కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ,  ఆవుల శివ ప్రసాద్ తో పాటు ప‌లువురిపై ఉజ్జయని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేశారు.


logo