మంగళవారం 01 డిసెంబర్ 2020
Nri-news - Oct 05, 2020 , 11:35:21

పీవీకి భారత రత్న ఇవ్వాలి : టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ

పీవీకి భారత రత్న ఇవ్వాలి : టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ

న్యూజీలాండ్ : టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ నూతన కమిటీ తొలి సమావేశం జగన్ మోహన్ రెడ్డి వాడ్నలా అధ్యక్షతన రిగింది. ముందుగా తెలంగాణ అమరవీరులకు, ఇటీవల మరణించిన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగా రెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం టీఆర్ఎస్ శాఖ జనరల్ సెక్రటరీ అరుణ్ ప్రకాష్ రెడ్డి నూతన కమిటీ సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి..మాట్లాడుతూ పార్టీకి సేవ చేసే అవకాశాన్నికల్పించిన మాజీ ఎంపీ కవిత కల్వకుంట్ల, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం తెలంగాణ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఆలాగే మాజీ దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్నిశాఖ తరపున ప్రతిపాదించారు. మంత్రి కేటీర్ పిలుపు మేరకు దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎన్నికల దృష్ట్యా తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు.

 

టీఆర్ఎస్ న్యూజీలాండ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన, కళ్యాణ్ రావురిని సత్కారించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ పోకల, నూతన హనోరారి చైర్ పర్సన్ నరసింగరావు ఇనగంటి, జనరల్ సెక్రటరీ అరుణప్రకాష్, ఉపాధ్యక్షులు   రామారావు రాచకొండ, కిరణ్ పోకల, ఉమెన్స్ చైర్ పర్సన్ సునీత విజయ్, కోశాధికారి వరుణ్ రావు మేచినేని, బిజినెస్ అఫైర్ చైర్ పర్సన్ ఇంద్ర సిరిగిరి, లక్ష్మి, సౌమ్య, మౌనిక, మానస పాల్గొన్నారు.