బుధవారం 25 నవంబర్ 2020
Nri-news - Oct 24, 2020 , 20:13:44

సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు..

సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు..

సింగపూర్‌: తెలంగాణ సంప్రదాయాన్ని సింగపూర్‌ దేశంలో కొనసాగించడంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలను శనివారం జూమ్ ద్వారా ఆన్‌లైన్‌లో కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతీ ఏటా సుమారు మూడువేల మంది పాల్గొనే ఈ వేడుకలను ఈ సారి కొవిడ్‌-19 నిబంధనలవల్ల 50 చోట్ల ఐదుగురు సమూహంతో ఆన్‌లైన్‌లో నిర్వహించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత వీడియో సందేశం ద్వారా టీసీఎస్‌ఎస్‌ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ బంజారా జానపద కళాకారిణి అశ్విని రాథోడ్ ధూంధాం పాటలతో అలరించారు. బతుకమ్మ పేర్చిన ప్రతి ఒక్కరికీ టీసీఎస్‌ఎస్‌ బృందం ఈ సారి ప్రశంసా బహుమతిని అందజేసింది. సంబురాలు విజయవంతమయ్యేందుకు సహకారం అందించిన దాతలకు టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్‌గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబురాలకు సమన్వయకర్తలుగా గడప స్వాతిరమేశ్, దీప నల్ల, నంగునూరి సౌజన్య, బొడ్ల రోజారమణి, గోనె రజితనరేందర్‌రెడ్డి, కల్వ రాజు, దుర్గాప్రసాద్, గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, నర్రా నిర్మల, ఆర్సీ రెడ్డి,  గార్లపాటి లక్ష్మారెడ్డి, జూలూరి పద్మజసంతోష్, బసిక అనితరెడ్డి, సునీతరెడ్డి మిర్యాల, పెరుకు శివరాంప్రసాద్‌ వ్యవహరించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.