గురువారం 03 డిసెంబర్ 2020
Nri-news - Oct 23, 2020 , 13:32:23

సింగ‌పూర్‌లో అక్టోబ‌ర్ 24న బ‌తుక‌మ్మ వేడుక‌లు

సింగ‌పూర్‌లో అక్టోబ‌ర్ 24న బ‌తుక‌మ్మ వేడుక‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ క‌ల్చ‌ర‌ల్ సొసైటీ సింగ‌పూర్‌(టీసీఎస్ఎస్) ఆధ్వ‌ర్యంలో అక్టోబ‌ర్ 24న సింగ‌పూర్‌లో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు నీలం మ‌హేంద‌ర్‌ తెలిపారు. జూమ్ ద్వారా బ‌తుక‌మ్మ వేడుక‌లకు ఏర్పాట్లు సిద్ధం చేసిన‌ట్లు చెప్పారు. కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 

బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ముఖ్య అతిథిగా పాల్గొన‌నున్నారు. తెలంగాణ బంజారా జాన‌ప‌ద క‌ళాకారిణి అశ్విని రాథోడ్ త‌న పాట‌ల‌తో అల‌రించ‌నున్నారు. బ‌తుక‌మ్మ‌ల‌ను అందంగా తీర్చిదిద్దిన వారికి ప్ర‌శంస బ‌హుమ‌తులు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ వేడుక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని టీసీఎస్ఎస్ అధ్య‌క్షుడు నీలం మ‌హేంద‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌సిక ప్ర‌శాంత్ రెడ్డి, కోశాధికారి న‌ల్ల భాస్క‌ర్ గుప్తా కోరారు.  

ఈ సంబురాలకు సమన్వయక‌ర్త‌లుగా గడప స్వాతి రమేశ్, దీప నల్ల, నంగునూరి సౌజన్య, బొడ్ల రోజా రమణి, గోనె రజిత రెడ్డి, కల్వ రాజు, దుర్గా ప్రసాద్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, నర్రా నిర్మల, జూలూరి పద్మజ సంతోష్, బసిక అనిత రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్ వ్యవ‌హరించ‌నున్నారు.