శనివారం 28 నవంబర్ 2020
Nri-news - Oct 24, 2020 , 17:14:42

ఆస్ర్టేలియాలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు

ఆస్ర్టేలియాలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు

హైద‌రాబాద్ : ఆస్ర్టేలియాలోని బ్రిస్బేన్‌లో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. తెలంగాణ ఆడ‌ప‌డుచులంద‌రూ స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుక‌ల‌ను తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేష‌న్ క‌లిపి నిర్వ‌హించారు. బ్రిస్బేన్‌లోని వినాయ‌క ఆల‌యంలో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హించి, కోలాటం, ఆట‌పాట‌ల‌తో సంద‌డి చేశారు. 

ఈ వేడుక‌ల్లో తెలంగాణ జాగృతి ఆస్ర్టేలియా ప్రెసిడెంట్ శ్రీక‌ర్ రెడ్డి, కోశాధికారి అనూష రెడ్డి సామ‌, క‌ల్చ‌ర్ సెక్ర‌ట‌రీ రంజిత్ కుమార్‌, బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ క‌విత‌, స‌భ్యులు అజ‌య్ క‌ల్లెం, కిశోర్ క‌త్తి, న‌రేశ్ ర‌చ్చ‌, శ్రీకాంత్ పొగాకు, హారిక కోనేరు,  శాలిని, ప్ర‌భాక‌ర్ బ‌చ్చు, శివ పాల్గొన్నారు. బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేసిన ప్ర‌తిఒక్క‌రికి నిర్వాహ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.