ఆదివారం 12 జూలై 2020
Nri-news - May 30, 2020 , 19:01:04

ఆన్‌లైన్‌లో అన్నమయ్య శత గళార్చన

ఆన్‌లైన్‌లో అన్నమయ్య శత గళార్చన

కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్నమయ్య శత గళార్చన కార్యక్రమానికి వినూత్నంగా ఆన్‌లైన్‌లో నిర్వహించి వీనులవిందు చేశారు. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ఆధ్వర్యంలో శనివారం అన్నమయ్య మూడో శత గళార్చన విజయవంతంగా నిర్వహించారు. గత రెండు సమ్మేళనాలు సింగపూర్‌లోని ప్రఖ్యాత ఆలయాల్లో జరిపారు. మూడో శత గళార్చనలో అమెరికా, బ్రిటన్‌, న్యూజీలాండ్‌, ఇండియా, దుబాయ్‌, జర్మనీ, సింగపూర్‌ తదితర దేశాల నుంచి తెలుగువారు పాల్గొని విజయవంతం చేశారు. 

శత గళార్చన కార్యక్రమంలో 200 మందికిపైగా భక్తి తత్వ సాధకుల భాగస్వామ్యంతో ప్రసారం చేపట్టారు. 100కు పైగా చిన్నారులు పంపిన అన్నమయ్య కీర్తనల నుంచి 16 కీర్తనలను ప్రత్యక్ష ప్రసారంగావించారు. ప్రసిద్ధ వయోలినిస్ట్‌, స్వరకర్త డాక్టర్‌ జ్యోత్స్నశ్రీకాంత్‌ తనదైన శైలిలో బ్రహ్మమొక్కటే కీర్తనను వయోలిన్‌పై ప్రదర్శించి అలరించారు. తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులైన చుక్కల ఉమాదేవి, చివుకుల లావణ్య, రాధాకృష్ణ గణేశ్‌, చివుకుల సురేష్‌, భాగవతుల రవితేజ, ఇతర స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో శత గళార్చన నిర్వహించినట్లు అంతర్జాతీయ శాఖ అధ్యక్షుడు ఊలపల్లి భాస్కర్‌, విద్యాధరి దంపతులు తెలిపారు.


logo