శనివారం 27 ఫిబ్రవరి 2021
Nri-news - Jan 24, 2021 , 09:48:35

ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి

ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి

హ్యూస్టన్/టెక్సాస్: వెండితెర అందగాడు, అలనాటి నటుడు శోభన్‌ బాబు జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నటభూషణుడి 85వ జయంతి సందర్భంగా అమెరికా గానకోకిల శారద ఆకునూరి సారధ్యంలో ఆన్‌లైన్‌ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీనియర్‌ నటీనటులు జమున, మురళీమోహన్‌, దర్శకులు కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు, నిర్మాత నరసింహారావు, శోభన్‌ బాబు మిత్రుడు డా. నగేష్‌ చెన్నుపాటి తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కాగా, శోభన్‌బాబుతో కలిసి పలు చిత్రాలో నటించిన చంద్రమోహన్‌.. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వీడియో సందేశాన్ని పంపించారు. 


వంశీ గ్లోబల్‌ అవార్డ్స్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకునూరి శారదతోపాటు గాయకులు రాము (చెన్నై), విశ్వమోహన్, శ్రీకర్ దర్భ, నాగి, శ్వేతా, లక్ష్మి (అమెరికా) శోభన్‌బాబు సినిమాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలను పాడి ఆయకు సంగీత నీరాజనం అందించారు.  

VIDEOS

logo