హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్‌చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. అద్వయ జిష్ణురెడ్డి, శిల్పాచౌదరి నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రేమ ప్రయాణంలోని ఆనందకర క్షణాలు..అంతలోనే బ్రేకప్ వంటి అంశాలతో టీజర్ ఎమోషనల్‌గా సాగింది. ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. వినోదానికి పెద్దపీట వేశాం. నేటి యువతరాన్ని మెప్పించే అంశాలన్నీ ఉంటాయి. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి. ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త అనుభూతినందిస్తుంది’ అని దర్శకుడు తెలిపారు. సీనియర్ సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. అభినవ్ గోమటం, ప్రణీత్‌రెడ్డి, అనీషా అల్ల, అక్షిత హరీష్, కోటి, బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, దర్శకత్వం: జానసాగర్ ద్వారక.