న్యూఢిల్లీ: వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో ఖాళీగా మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 20 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మొత్తం 211 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
మొత్తం పోస్టులు: 211
ఇందులో మైనింగ్ సిర్దార్ 167, సర్వేయర్ 44 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మైనింగ్ సిర్దార్ పోస్టుకు మైనింగ్‌లో డిప్లొమా, సర్వేయర్‌కు పదో తరగతి పాసై సర్వేయర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 20
వెబ్సైట్: westerncoal.nic.in