హైదరాబాద్: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 68
అసిస్టెంట్ మేనేజర్ 50 (సివిల్ ఇంజినీర్ 36, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 10, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ 4), డిప్యూటీ మేనేజర్ 10, రిలేషన్షిప్ మేనేజర్ 1, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్, ఎంబీఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవాలి. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు ఎంబీఏ లేదా రూరల్ మేనేజ్మెంట్లో పీజీడీఎం, అగ్రిబిజినెస్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ, ప్రోడక్ట్ మేనేజర్‌కు ఎంబీఏతోపాటు సంబంధిత సబ్జెక్టులో బీటెక్, మిగిలిన పోస్టుకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 13
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2
వెబ్సైట్: www.bank.sbi/careers (or) www.sbi.co.in/careers