న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 1 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గేట్-2021 ద్వారా భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు: 309
ఇందులో ఏఈఈ మెకానికల్ 6, పెట్రోలియం 1, సివిల్ 18, మెకానికల్ 28, ఎలక్ట్రికల్ 40, ఎలక్ట్రానిక్స్ 5, ఇన్స్ట్రుమెంటేషన్ 32, మెకానికల్ 33, కెమికల్ 16, పెట్రోలియం 12, ఎన్విరాన్మెంట్ 5, రిజర్వాయర్ 14, కెమిస్ట్ 14, జియోలాజిస్ట్ 19, జియోఫిజిసిస్ట్ 35, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ 13, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 8 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గేట్-2021లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్-2021 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 1
వెబ్సైట్: www.ongcindia.com