న్యూఢిల్లీ: పోర్ట్ బ్లేయిర్‌లోని నేవల్ షిప్ రిపేర్ యార్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 302 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిసిగ్నేటెడ్ ట్రేడ్, నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడిన 50 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ఎప్లాయ్మెంట్ న్యూస్ ఆగస్టు 20-27 ఎడిషన్‌లో ప్రచురితమైంది.
మొత్తం పోస్టులు: 302
ఇందులో మెషినిస్ట్ 16, ప్లంబర్/పైప్ ఫిట్టర్ 8, పెయింటర్ 7, టైలర్ 6, వెల్డర్ 20, మెకానిక్ ఎంటీఎం 7, వెల్డర్ షిప్ ఫిట్టర్ 3, షీట్ మెటల్ వర్కర్ 1 (డిజైన్డ్ పోస్టులు), ఎలక్ట్రానిక్ మెకానిక్ 46, ఎలక్ట్రిషన్ 29, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 8, ఫిట్టర్ 37, డీజిల్ మెకానిక్ 42, ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ మెకానిక్ 11, షీట్ మెటల్ వర్కర్ 18, కార్పెంటర్ 33, మాసన్ 7, ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 (నాన్ డిజైన్డ్ పోస్టులు) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్: HE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL),
NAVAL SHIP REPAIR YARD (PBR),
POST BOX NO. 705, HADDO,
PORT BLAIR – 744102,
SOUTH ANDAMAN
దరఖాస్తులకు చివరితేదీ: నోటిఫికేషన్ విడుదలైన 50 రోజుల్లో
వెబ్సైట్: https://www.indiannavy.nic.in/