న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనోటిఫికేషన్ ద్వారా 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్‌లో మూడు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 22
ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ 8 (హైదరాబాద్ 1 పోస్టు), అసిస్టెంట్ సూపర్వైజర్ అకౌంట్స్ 14 (హైదరాబాద్‌లో 2 పోస్టులు)
అర్హతలు: ఫైనాన్స్ పోస్టులకు ఎంబీఏ, ఐసీఏ, ఐసీఎంఏలలో ఏదో ఒకటి, అకౌంట్స్ పోస్టులకు కామర్స్‌లో డిగ్రీ చేసి 2021, ఆగస్టు 1 నాటికి 30/28 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్య్వూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: AIESL
Personnel Department,
2nd Floor, CRA Building, Safdarjung Airport Complex,
Aurbindo Marg, New Delhi – 110 003
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
వెబ్సైట్: http://aiesl.airindia.in/