న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 242 అప్రెంటిస్లను అందిస్తున్నది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, టర్నర్ వంటి ట్రేడ్లు ఉన్నాయి.
మొత్తం అప్రెంటిస్లు: 242
ఇందులో ఫిట్టర్ 80, ఎలక్ట్రిషియన్ 80, వెల్డర్ 40, టర్నర్ లేదా మెషినిస్ట్ 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 5, మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికిల్ 12, కార్పెంటర్ 5, ప్లంబర్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి పాసై, ఐటీఐలో పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 29
వెబ్సైట్: www.uraniumcorp.in