న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన (IAF)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 282 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులు ఉన్నాయి. వచ్చేనెల 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 282
ఇందులో మెయింటైనెన్స్ కమాండ్, హెడ్‌క్వార్టర్ 153, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్ 32, సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్ 11, ఇండిపెండెంట్ యూనిట్స్ 1, కుక్ (ఆర్డినరీ గ్రేడ్) 1, మెస్ స్టాఫ్ 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18, హౌస్ కీపింగ్ స్టాఫ్ 15, హిందీ టైపిస్ట్ 3, లోయర్ డివిజన్ క్లర్క్ 10, స్టోర్ కీపర్ 3, కార్పెంటర్ 3, పెయింటర్ 1, సూపరింటెండెంట్ (స్టోర్) 5, సివిలియన్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ పోస్టులకు ఇంటర్, కుక్ పోస్టుకు మెట్రిక్యులేషన్, డిప్లొమా ఇన్ కేటరింగ్, ఇతర పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సండంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరాలా పోస్టులో పంపించాలి. లో ఇవ్వాలి.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 7
వెబ్సైట్: https://indianairforce.nic.in/